
జనరల్

'పుష్ప 2' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఫహద్ ఫాసిల్, ఇప్పుడు 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' చిత్రంతో హీరోగా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఫాంటసీ, థ్రిల్లర్, కామెడీ అంశాల కలయికతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, ఫహద్ మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు టీజర్ స్పష్టం చేసింది.
ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫహద్ 'సూరి' పాత్రలో నటిస్తుండగా, సారా 'దివ్య' పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథ అసాధారణ శక్తులు కలిగిన యువతి చుట్టూ తిరుగుతుంది. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో, ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 11న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!