

ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. స్పేస్‌ఎక్స్ సంస్థ రికార్డు స్థాయిలో నిధులను సమీకరించిన నేపథ్యంలో ఆయన నికర సంపద ట్రిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచిన వ్యక్తిగా మస్క్ చరిత్ర సృష్టించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక రంగంలో సంచలనంగా మారింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం, మస్క్ సంపద కొన్ని దేశాల వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఎక్కువగా ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. తైవాన్, సౌదీ అరేబియా, నెదర్లాండ్స్, టర్కీ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థల పరిమాణంతో పోల్చదగిన స్థాయికి ఆయన సంపద చేరినట్లు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఆస్తుల విలువ కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అధిగమించడం ప్రపంచ ఆర్థిక చరిత్రలో అరుదైన పరిణామంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!