

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీని మరింత ‘ఏఐ-నేటివ్’ సంస్థగా మార్చేందుకు ప్రాజెక్ట్ ఓటీ (Project OT)ను రూపొందించినట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ప్రణాళికలో కొన్ని విభాగాల టీమ్‌ల పరిమాణాన్ని రెండు దశల్లో గరిష్ఠంగా 60 శాతం వరకు తగ్గించి, రోజువారీ పనుల్లో ఏఐ ఏజెంట్లను విస్తృతంగా ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మేలో తొలి దశలో సుమారు 10 శాతం స్థాయి ఉద్యోగుల కోతలు చేపట్టినప్పటికీ, రెండో దశలో మరిన్ని కోతలు చేపట్టే ప్రణాళికను తరువాత విరమించినట్లు సమాచారం.
అయితే ఏఐ ఏజెంట్ల నుంచి ఆశించిన స్థాయిలో ఉత్పాదకత పెరగకపోవడం, ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, పని ప్రక్రియల్లో అంతరాయాలు తలెత్తడం వంటి కారణాలతో ఈ ప్రణాళికకు ఎదురుదెబ్బ తగిలినట్లు రాయిటర్స్ పేర్కొంది. కొన్ని అంతర్గత గణాంకాల ప్రకారం కోడ్ మార్పులు భారీగా పెరిగినా, వినియోగదారులకు అందే కొత్త లేదా మెరుగైన ఫీచర్ల వృద్ధి అంత స్థాయిలో కనిపించలేదు. మెటా మాత్రం ఏఐపై పెట్టుబడులను కొనసాగిస్తోంది; భవిష్యత్‌లో ఏఐ ఉద్యోగులను భర్తీ చేయడం కంటే వారి సామర్థ్యాన్ని పెంచే విధానంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!