

‘స్టార్ పవర్ ఉంటే నెగెటివ్ టాక్ కూడా వసూళ్లను అడ్డుకోలేదని’ ‘టాక్సిక్’ మరోసారి నిరూపించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంది సినిమా ఆశించిన స్థాయిలో లేదంటూ సోషల్ మీడియాలో నెగెటివ్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పలు సినిమా రివ్యూలు కూడా ప్రతికూలంగానే వచ్చాయి.
అయితే ఈ ప్రభావం వసూళ్లపై పెద్దగా కనిపించలేదని సమాచారం. సినీ వర్గాల ప్రకారం తొలి రోజు భారత్‌లో రూ.120 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ సుమారు రూ.55 కోట్లు, కన్నడలో రూ.23.3 కోట్లు, తెలుగులో రూ.16 కోట్లు, తమిళంలో రూ.5.5 కోట్లు, మలయాళంలో రూ.1.3 కోట్లు వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న గణాంకాలు మాత్రమే కాగా.. తొలి రోజు కలెక్షన్స్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!