

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కాసాండ్ర తాజాగా ఓ వైరల్ వీడియో కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఓ ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన సమయంలో రెజీనా తన చెప్పులు విప్పగా.. వాటిని ఆమె పీఏ చేతిలో పట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు ఆమె తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే మరికొందరు మాత్రం వీడియోలో కనిపిస్తున్న కొన్ని సెకన్ల ఆధారంగా పూర్తి విషయం తెలియకుండానే విమర్శలు చేయడం సరికాదని అంటున్నారు. ఆ సమయంలో అసలు ఏం జరిగిందో రెజీనా లేదా ఈవెంట్ నిర్వాహకులు వివరణ ఇస్తేనే పూర్తి స్పష్టత వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై రెజీనా ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు ఆమె ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’లో కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!