
జనరల్

విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ పెట్ ఫుడ్ విభాగంలోకి ప్రవేశించింది. అంతర్జాతీయ డాగ్ డే సందర్భంగా ‘స్నగిల్స్’ పేరుతో ప్రీమియం న్యూట్రిషన్ బ్రాండ్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. బుధవారం ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా కంపెనీ ఫుడ్, న్యూ బిజినెస్ ప్రెసిడెంట్ అనిల్ ఛుగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత్‌లో పెట్ ఫుడ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ప్రస్తుతం దాని పరిమాణం సుమారు రూ.5,500 కోట్లుగా ఉందని అనిల్ ఛుగ్ తెలిపారు. ఈ మార్కెట్‌లోని అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో విప్రో ఈ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు. ఫ్రీజ్‌డ్ డ్రైడ్ చికెన్ చంక్స్‌తో స్నగిల్స్ ఉత్పత్తులను రూపొందించినట్లు చెప్పారు. వీటి ప్రారంభ ధర రూ.530గా నిర్ణయించినట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!