16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

Writer: Pooja 11:02 AM, 16 సెప్టెంబర్, 2026
రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

వినియోగదారులను ఎక్కువ మొత్తం చెల్లించేలా ప్రేరేపించే సందేశాలు, యాప్‌ ఇంటర్‌ఫేస్‌ విధానాలను నిలిపివేయాలని ప్రముఖ బైక్‌ ట్యాక్సీ సేవ రాపిడోను సెంట్రల్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) ఆదేశించింది. అలాగే రాపిడోను నిర్వహిస్తున్న రోప్పెన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై రూ.10 లక్షల జరిమానా విధించింది. రైడ్‌ బుకింగ్‌ ప్రక్రియలో ‘క్యాప్టెన్లు ఈ ధరకు అంగీకరించడం లేదు.. రూ.10, రూ.20, రూ.30 పెంచి చూడండి’ వంటి సందేశాలు చూపించడం ద్వారా వినియోగదారులను అధికంగా చెల్లించేలా ప్రభావితం చేసినట్లు సీసీపీఏ పేర్కొంది.

రైడ్‌ ధరను పెంచితే రైడ్‌ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందనే భావనను ఈ సందేశాలు కలిగిస్తున్నాయని సీసీపీఏ తెలిపింది. అలాగే రాపిడోలోని ‘సెట్‌ యువర్‌ ప్రైస్‌’ ఫీచర్‌లో ధర పెంచినప్పుడు ఆకుపచ్చ రంగు, తగ్గించినప్పుడు ఎరుపు లేదా నారింజ రంగు కనిపించేలా ఉండటాన్ని కూడా సీసీపీఏ తప్పుబట్టింది. ఈ విధానం వినియోగదారులను అధిక ధర వైపు మళ్లించే ‘కన్ఫర్మ్‌ షేమింగ్‌’, ‘ఇంటర్‌ఫేస్‌ ఇంటర్‌ఫీరెన్స్‌’ అనే డార్క్‌ ప్యాటర్న్స్‌గా గుర్తించింది.

రైడ్‌ బుక్‌ కాకపోతే అదనపు మొత్తాన్ని చెల్లించమని సూచించే సందేశాలు రైడర్‌, క్యాప్టెన్‌ మధ్య జరిగే రియల్‌టైమ్‌ సంభాషణలో భాగమేనని రాపిడో వాదించింది. అయితే సీసీపీఏ ఈ వాదనను అంగీకరించలేదు. రైడ్‌ ప్రారంభం కాకముందే అదనపు మొత్తాన్ని ‘టిప్‌’గా సూచించడం సముచితం కాదని, సాధారణంగా టిప్‌ సేవ అందిన తర్వాత స్వచ్ఛందంగా ఇచ్చేది అని పేర్కొంది. ఇదే అంశంపై ఇతర క్యాబ్‌, బైక్‌ ట్యాక్సీ సంస్థల విధానాలనూ సీసీపీఏ పరిశీలిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తగ్గిన పసిడి ధరలు

తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

ట్యాగ్లు
రాపిడోసీసీపీఏవినియోగదారుల రక్షణడార్క్ ప్యాటర్న్స్బైక్ ట్యాక్సీరైడ్ బుకింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు
రాజకీయాలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!
ఓటీటీ

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!
టెక్నాలజీ

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..
సినిమాలు

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం
జనరల్

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి
రాజకీయాలు

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్
బిజినెస్

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

అయోడిన్‌ లోపం రాకుండా ఈ ఆహారాలు తీసుకోండి: డాక్టర్లు
ఆరోగ్యం

అయోడిన్‌ లోపం రాకుండా ఈ ఆహారాలు తీసుకోండి: డాక్టర్లు

తగ్గిన పసిడి ధరలు
బిజినెస్

తగ్గిన పసిడి ధరలు

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...
సినిమాలు

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!