

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌కు చాలాకాలంగా మంచి ఆదరణ ఉంది. 1999లో దేశీయ మార్కెట్లోకి వచ్చిన ఈ ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ కాలానుగుణంగా అనేక మార్పులతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడో తరం ఫేస్‌లిఫ్ట్ మోడల్ 2022 ఫిబ్రవరిలో విడుదలైంది. తాజాగా పూర్తిగా కవర్ చేసిన టెస్ట్ వెర్షన్ రోడ్లపై కనిపించడంతో కొత్త అప్‌డేట్‌పై ఆసక్తి పెరిగింది.
కొత్త వ్యాగన్‌ఆర్‌లో డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ముందు భాగంలో కొత్త డిజైన్ హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ గ్రిల్, మారిన బంపర్, కొత్త ఎయిర్ ఇన్‌లెట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వెనుక బంపర్‌లో కూడా స్వల్ప మార్పులు చేసి, వర్టికల్ రిఫ్లెక్టర్లను అందించే అవకాశం ఉంది. టెయిల్ ల్యాంప్స్‌లో మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఇంటీరియర్‌లోనూ ప్రస్తుత లేఅవుట్‌ను కొనసాగిస్తూ కొన్ని స్టైలింగ్ అప్‌డేట్స్ చేసే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!