

దేశవ్యాప్తంగా దాతృత్వ, సేవా కార్యక్రమాల కోసం రూ.100 కోట్లను కేటాయించినట్లు జోయాలుక్కాస్ గ్రూప్ ప్రకటించింది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు గృహ నిర్మాణం, బాలికల విద్య, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, వృద్ధులకు సహాయం వంటి పలు కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. జోయాలుక్కాస్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జోయ్ అలుక్కాస్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఈ దాతృత్వ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఇప్పటికే పలు ఛారిటబుల్ ప్రాజెక్టుల కింద తమ గ్రూప్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని జోయ్ అలుక్కాస్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మందికి సేవలందించాలనే లక్ష్యంతో తాజాగా రూ.100 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధుల ద్వారా సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మరింత చేరువై, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయనున్నట్లు గ్రూప్ పేర్కొంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!