

కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల్లో భాగంగా ఆరోగ్య, విద్యా రంగాల్లో సేవలందిస్తున్న సంస్థలకు రూ.2.28 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు జీఆర్‌టీ జువెలర్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా తమిళనాడులోని కుంభకోణం టౌన్ హైస్కూల్ భవన పునరుద్ధరణతో పాటు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.95 లక్షలు కేటాయించింది. అలాగే, అంబత్తూర్‌కు చెందిన ఆనందం ట్రస్ట్‌కు రూ.25 లక్షలు, ట్యాంకర్ ఫౌండేషన్‌కు మరో రూ.25 లక్షల నిధులను అందించనున్నట్లు వెల్లడించింది.
దేశంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఒకటైన ఆంధ్ర మహిళా సభకు రూ.83 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ నిధులను ఆయా సంస్థలు తమ ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేసేందుకు వినియోగించనున్నాయి. 1964లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి సామాజిక బాధ్యతలో భాగంగా తమ సంస్థ పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తూ వస్తోందని జీఆర్‌టీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు ఆనంద్ అనంత్ పద్మనాభన్, జీఆర్ రాధాకృష్ణన్ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!