
రాజకీయాలు

ముడిసరుకు వ్యయం పెరగడంతో వాహనాల ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ప్రకటించింది. రేపటి నుంచి ఎస్‌యూవీ వాహనాల ధరలను సగటున 2.7 శాతం, వాణిజ్య వాహనాల ధరలను సగటున 2 శాతం పెంచనున్నట్లు వెల్లడించింది.
మోడల్‌ను బట్టి ధరల పెంపు మారుతుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మహీంద్రా విక్రయిస్తున్న స్కార్పియో, థార్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వో వంటి ఎస్‌యూవీల ధరలు రూ.7.54 లక్షల నుంచి రూ.25.07 లక్షల మధ్య ఉన్నాయి. రేపటి నుంచి ఈ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులు కొత్త ధరలు చెల్లించాల్సి ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!