
సినిమాలు

సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో ఈ సమ్మిట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐదు నగరాల్లో ప్రాంతీయ పెట్టుబడి సదస్సులను కూడా నిర్వహించనున్నారు.
సమ్మిట్‌ను కేవలం ఎంవోయూలకే పరిమితం చేయకుండా, పెట్టుబడి హామీలు వాస్తవ ప్రాజెక్టులుగా మారేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు షార్క్ ట్యాంక్ తరహా వేదికను ఏర్పాటు చేయాలని సూచించారు. సమ్మిట్‌లో పాల్గొనేందుకు 21 దేశాల ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!