
రాజకీయాలు

ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ జావా భారత మార్కెట్లో కొత్త ‘జావా 42 ఆల్‌స్టార్స్ ఎడిషన్’ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.1,79,942గా నిర్ణయించింది. ఈ కొత్త ఎడిషన్‌లో 294.72 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్‌సీ ఇంజిన్‌ను అందించారు. సరికొత్త గ్రాఫిక్స్, ఆల్‌స్టార్స్ బ్యాడ్జింగ్ ఈ మోడల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న జావా యెజ్డీ డీలర్‌షిప్‌లలో ఈ కొత్త ఎడిషన్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14 నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్టు కంపెనీ తెలిపింది. కొత్త గ్రాఫిక్స్, ప్రత్యేక బ్యాడ్జింగ్‌తో వచ్చిన ఈ ఎడిషన్ జావా 42 శ్రేణిలో మరింత ఆకర్షణను పెంచేలా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!