

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. భారత్, అమెరికా, యూకే సహా పలు దేశాల్లోని అమెజాన్ రిటైల్ విభాగంపై ఈ ఉద్యోగ కోతల ప్రభావం పడింది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు భవిష్యత్ వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా సంస్థను మరింత వేగంగా, సమర్థంగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు.
ఈ లేఆఫ్‌ల ప్రభావం అమెజాన్ స్టోర్స్ బిజినెస్‌లోని రిటైల్ విభాగంపై ఎక్కువగా పడింది. కస్టమర్ సర్వీస్, మార్కెట్‌ప్లేస్ సపోర్ట్, రిటైల్ ఇంజినీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులు కూడా ప్రభావితమయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాట్లాడుతూ కరోనా సమయంలో భారీగా ఆర్డర్లు రావడంతో సంస్థ అవసరానికి మించి నియామకాలు చేపట్టిందని, ప్రస్తుతం వాటిని సర్దుబాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 2025 చివర్లో 14,000 మంది, 2026 జనవరిలో మరో 16,000 మందిని తొలగించిన అమెజాన్.. తాజాగా మరో 1,000 ఉద్యోగాల కోత ప్రకటించింది. ఇదే సమయంలో ‘గ్రేట్ ఇండియన్ సేల్’ ప్రారంభం కావడం గమనార్హం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!