

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పోర్ట్ ఆపరేటర్ అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ (ఏబీపీ)లో 63.88 శాతం వాటా కొనుగోలుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.95,000 కోట్లు)గా అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం పూర్తయితే బ్రిటిష్ పోర్ట్ రంగంలో భారతీయ సంస్థ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలిచే అవకాశం ఉంది.
ఏబీపీ ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్‌లోని 21 కీలక నౌకాశ్రయాలను నిర్వహిస్తోంది. యూకే సముద్ర వాణిజ్యంలో దాదాపు 25 శాతం ఈ పోర్టుల ద్వారానే జరుగుతోంది. యూకేలో అతిపెద్ద కార్గో పోర్ట్ ఇమ్మింగ్‌హమ్, ప్రధాన ఎగుమతి కేంద్రం సౌతాంప్టన్ కూడా ఏబీపీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. గత ఏడాది ఈ సంస్థ 425 మిలియన్ టన్నుల సరుకు రవాణా నిర్వహించి £819.8 మిలియన్ ఆదాయం ఆర్జించింది.
ప్రస్తుతం ఏబీపీలోని 63.88 శాతం వాటా కెనడాకు చెందిన రెండు పెన్షన్ ఫండ్ల చేతిలో ఉంది. ఈ వాటా కొనుగోలుపై అదానీ పోర్ట్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అదానీ గ్రూప్ అధికారికంగా స్పందించలేదు. ఇదే సమయంలో ఏపీసెజ్ తొలి త్రైమాసికంలో రూ.3,649 కోట్ల నికర లాభం నమోదు చేయగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మాత్రం రూ.1,160.23 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!