

తెలియని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే సందేశాలపై వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు వాట్సాప్ కొత్త భద్రతా ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. సేవ్ చేయని నంబర్ నుంచి చాట్ ఓపెన్ చేసినప్పుడు ముందుగా ప్రత్యేక హెచ్చరిక సందేశం కనిపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఆన్‌లైన్ మోసాలు, సైబర్ దాడులు, స్పామ్ సందేశాల నుంచి వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది.
హెచ్చరిక స్క్రీన్‌లో ఆ ఫోన్ నంబర్ ఏ దేశానికి చెందినదో, అది కాంటాక్ట్‌గా సేవ్ అయ్యిందో లేదో, ఇరువురికీ ఉమ్మడి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో లేదో చూపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్లు లేదా డబ్బు పంపవద్దని స్పష్టమైన హెచ్చరిక కూడా కనిపిస్తుంది. వివరాలు పరిశీలించిన తర్వాత చాట్ కొనసాగించాలా లేదా రద్దు చేసుకోవాలా అనే నిర్ణయాన్ని వినియోగదారుడు తీసుకోవచ్చు. ఈ నిర్ణయం గురించి అవతలి వ్యక్తికి ఎలాంటి సమాచారం వెళ్లదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!