

చాట్‌జీపీటీ సంస్థ ఓపెన్‌ఏఐ చేపడుతున్న రహస్య వినియోగదారు పరికరాల ప్రాజెక్ట్ నేపథ్యంలో యాపిల్, ఓపెన్‌ఏఐ మధ్య న్యాయపోరు మరింత తీవ్రతరమైంది. ఓపెన్‌ఏఐలో చేరిన మాజీ యాపిల్ ఉద్యోగుల ద్వారా తమ గోప్య సమాచారాన్ని, వాణిజ్య రహస్యాలను సేకరించి హార్డ్‌వేర్ అభివృద్ధికి ఉపయోగించేందుకు ప్రయత్నించారని యాపిల్ ఆరోపించింది. ఈ సమాచారాన్ని వినియోగించడం లేదా వెల్లడించకుండా ఓపెన్‌ఏఐపై న్యాయపరమైన ఆంక్షలు విధించాలని యాపిల్ కోరుతోంది.
అయితే యాపిల్ చేసిన ఆరోపణలను ఓపెన్‌ఏఐ తీవ్రంగా ఖండించింది. అవి నిరాధారమైనవని పేర్కొంటూ కేసును కొట్టివేయాలని అమెరికా కోర్టును కోరింది. తమకు యాపిల్ వాణిజ్య రహస్యాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని, ఆరోపించిన రహస్యాలు ఏమిటో యాపిల్ స్పష్టంగా నిరూపించలేదని ఓపెన్‌ఏఐ వాదిస్తోంది. సాఫ్ట్‌వేర్‌తో పాటు వినియోగదారు హార్డ్‌వేర్ రంగంలోకి కూడా ఓపెన్‌ఏఐ అడుగులు వేస్తున్న సమయంలో ఈ వివాదం రెండు టెక్ దిగ్గజాల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!