

స్పామ్ కాల్స్ మొబైల్ వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. రోజూ బ్యాంకింగ్, లోన్లు, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ పేర్లతో వచ్చే కాల్స్‌తో పాటు సైబర్ మోసాలకు పాల్పడే కాల్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక నంబర్‌ను బ్లాక్ చేసినా మరో కొత్త నంబర్ నుంచి మళ్లీ కాల్స్ రావడంతో వినియోగదారులు విసిగిపోతున్నారు. పనిలో బిజీగా ఉన్నప్పుడు లేదా ప్రయాణంలో ఉన్న సమయంలో వచ్చే ఈ కాల్స్ మరింత చిరాకు తెప్పిస్తున్నాయి.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కఠిన చర్యలు చేపట్టింది. ఫైనాన్స్ సంస్థలు ప్రత్యేక నంబర్లను మాత్రమే వినియోగించాలని సూచించడంతో పాటు, స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ వినియోగదారులు తమకు కావలసిన కాల్స్ మాత్రమే స్వీకరించేలా నియంత్రణ పొందే అవకాశం కల్పించింది.
స్పామ్ కాల్స్‌ను నియంత్రించేందుకు ట్రాయ్ ‘డూ నాట్ డిస్టర్బ్’ (DND) 3.0 యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ఏ రకమైన కాల్స్ కావాలో ఎంపిక చేసుకోవచ్చు. అలాగే స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై నేరుగా ట్రాయ్‌కు ఫిర్యాదు చేసే సదుపాయం ఉంది. ఇది ప్రభుత్వ యాప్ కావడంతో వినియోగదారుల డేటాకు పూర్తి భద్రత ఉంటుందని ట్రాయ్ స్పష్టం చేసింది.
ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ చేసి, మొబైల్ నంబర్‌తో ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి. డీఎన్డీ రిజిస్ట్రీలో చేరి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. స్పామ్ కాల్స్‌పై ఫిర్యాదు చేయడమే కాకుండా, ఫిర్యాదు స్థితిని యాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. అదనంగా 1909 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.in వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!