

Redmi కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Redmi Note 15 5G భారత్‌లో జనవరి 6 ఉదయం 11 గంటలకు అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్‌తో పాటు Redmi Pad 2 Pro కూడా విడుదల చేయనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 ఇంచుల కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండనుంది. అలాగే IP66 రేటింగ్‌తో నీరు, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. డిజైన్ పరంగా కర్వ్డ్ ఎడ్జెస్, స్క్వేర్ కెమెరా మాడ్యూల్తో స్టైలిష్ లుక్ ఇవ్వనున్నారు.
పర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్లో Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 5,520mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించనుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 1.6 రోజుల బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. కెమెరా సెక్షన్లో 108MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో) ఉండగా, 4K వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉంటుంది. ధర విషయానికి వస్తే, భారత్‌లో ఈ ఫోన్ ధర సుమారు రూ.20,000 చుట్టూ ఉండే అవకాశం ఉందని అంచనా. OnePlus Nord CE 5, Realme P4 Pro వంటి ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!