

యూట్యూబ్ తన క్రియేటర్లను AI ఆధారిత డీప్‌ఫేక్ వీడియోల నుంచి రక్షించేందుకు కొత్త లైక్నెస్ డిటెక్షన్ టూల్‌ను విడుదల చేసింది. ఈ టూల్ సాయంతో ఎవరి ముఖం లేదా వాయిస్‌ను అనుమతి లేకుండా ఉపయోగించిన వీడియోలను గుర్తించవచ్చు.ఈ సదుపాయాన్ని ఉపయోగించాలంటే, అర్హత కలిగిన యూట్యూబ్ క్రియేటర్లు ముందుగా సర్కార్ ఆమోదించిన ఐడి కార్డ్ మరియు వీడియో సెల్ఫీ సమర్పించాల్సి ఉంటుంది. ధృవీకరణ పూర్తయిన తర్వాత, క్రియేటర్లు తమ డాష్‌బోర్డ్‌లోకి వెళ్లి డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించగలరు.ప్రస్తుతం ఈ ఫీచర్‌ను యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. తర్వాత దశల్లో మరింత మంది వినియోగదారులకు ఇది విస్తరించబడుతుంది. భద్రత కోసం సమర్పించిన సమాచారం గూగుల్ సర్వర్లలో సురక్షితంగా నిల్వ చేయబడుతుంది.
ఈ టూల్ ద్వారా గుర్తించిన వీడియోలను క్రియేటర్లు రిమూవ్ చేయమని లేదా ఆర్కైవ్ చేయమని యూట్యూబ్‌కు అభ్యర్థించవచ్చు. కంపెనీ వాటిని సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటుంది.ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉండటంతో, కొంతమంది క్రియేటర్లకు తమ సొంత వీడియోలు కూడా ఫలితాల్లో కనిపించవచ్చు. టూల్‌ను ఎప్పుడైనా Manage Tool ఆప్షన్ ద్వారా డిసేబుల్ చేయవచ్చు, అప్పుడు 24 గంటల తర్వాత యూట్యూబ్ వారి డేటా స్కానింగ్‌ను నిలిపివేస్తుంది.డీప్‌ఫేక్ మరియు AI దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, యూట్యూబ్ ఈ కొత్త టూల్‌తో క్రియేటర్ల భద్రతకు మరో బలమైన అడుగు వేసింది.






.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!