
రాజకీయాలు

హైదరాబాద్‌లో వెలుగుచూసిన అక్రమ అండాల దానం కేసులో పోలీసులు మరిన్ని అరెస్టులు చేశారు. సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ సంస్థకు చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) ఆశిష్ అగర్వాల్, అకౌంటెంట్ రెంటాల శేషగిరిరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
రసూల్‌పురా మెట్రో స్టేషన్ సమీపంలో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆశిష్ అగర్వాల్‌ను A-11గా, రెంటాల శేషగిరిరావును A-12గా పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!