
రాజకీయాలు

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమ పార్టీ తీసుకున్న వైఖరిలో ఎలాంటి మార్పు లేదని డీఎంకే ఐటీ వింగ్ స్పష్టం చేసింది. ఈ విషయంలో పార్టీ దృఢంగా ఉందని పేర్కొంటూ, న్యాయబద్ధమైన పునర్విభజన జరగాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని వెల్లడించింది. ఈ ప్రక్రియ వల్ల తమిళనాడుకు ఎలాంటి నష్టం జరగదని తన సోషల్ మీడియా పోస్టులో తెలిపింది.
తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 లోక్‌సభ స్థానాలు 59కి పెరిగే అవకాశం ఉందని డీఎంకే ఐటీ వింగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రానికి ఉన్న 7.23 శాతం వాటా 2051 వరకు సురక్షితంగా ఉంటుందని తెలిపింది. రాబోయే 25 ఏళ్లలో తమిళనాడు ఎంపీ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం లేదని స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!