

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ యాప్‌కి కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ వివరాలను ఫోన్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సురక్షితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. యూజర్లు అవసరమైనప్పుడు సెక్యూర్ లాగిన్ ద్వారా తమ వివరాలను చూడగలరు, దీని ద్వారా గోప్యత మరింతగా కాపాడబడుతుంది.
కొత్త ఆధార్ యాప్‌లో ఆధార్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవడం, షేర్ చేయడం చాలా సులభం అయ్యింది. అలాగే ఆధార్ ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించబడిందో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో వినియోగదారుల్లో పారదర్శకత మరియు భద్రత పెరుగుతుందని UIDAI తెలిపింది.
తాజా యాప్‌లో ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సదుపాయం ఉంది. ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను కూడా మెరుగుపరచారు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో డౌన్లోడ్ చేసుకోవచ్చని UIDAI పేర్కొంది.











కామెంట్స్ (1)
Informative..