

ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలకు పోటీగా మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సూపర్ యాప్ను తీసుకురానున్నట్లు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోపైలట్ సాధారణ చాట్‌బాట్ స్థాయిని దాటి మరింత సమగ్ర సేవలు అందించే సూపర్ యాప్‌గా వేగంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ఇది మైక్రోసాఫ్ట్ ఏఐ ప్రయాణంలో కీలక మైలురాయని పేర్కొంటూ, భవిష్యత్తులో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే, మైక్రోసాఫ్ట్ వార్షిక ఆదాయం 331 బిలియన్ డాలర్లను దాటగా, క్లౌడ్ వ్యాపారం ద్వారా 214 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదైంది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 35.8 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 62 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభం ప్రకటించింది. ఈ ఫలితాల ప్రభావంతో దక్షిణ కొరియా కోస్పి సూచీ 4 శాతానికి పైగా లాభపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!