
జనరల్

హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న కృత్రిమ మేధ ఆధారిత డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం కంట్రోల్‌ఎస్ డేటాసెంటర్స్ రూ.5,500 కోట్ల రుణాన్ని సమీకరించింది. డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4,000 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,500 కోట్ల నిధులను మంజూరు చేశాయి. ఈ రుణాన్ని బ్యాంకులు తొలుత ప్రాజెక్ట్ ఫైనాన్స్ రూపంలో అందించి, తర్వాత లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ విధానంలోకి మార్చనున్నాయి.
హైదరాబాద్‌లో 3.5 గిగావాట్ల సామర్థ్యంతో ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు కంట్రోల్‌ఎస్ డేటాసెంటర్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. పెరుగుతున్న ఏఐ, క్లౌడ్ సేవల అవసరాలను తీర్చడంతో పాటు దేశ డిజిటల్ మౌలిక వసతులకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!