
జనరల్

ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహట్కర్‌ను బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం కలిసింది. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన ఘటన వివరాలను ఆమెకు వివరించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు.
మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అవమానించారని, అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. శాసనసభ్యులుగా తమకున్న హక్కులకు విఘాతం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!