

పాత స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న వారికి వాట్సాప్ కీలక మార్పు చేసింది. ఆండ్రాయిడ్ 5.0, 5.1 వెర్షన్లలో పనిచేసే ఫోన్లకు సెప్టెంబర్ 8, 2026 నుంచి వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోయింది. దీంతో ఆయా ఫోన్లలో ఇకపై వాట్సాప్ సేవలను ఉపయోగించడం సాధ్యం కాదు. వాట్సాప్ అధికారిక హెల్ప్ సెంటర్ ప్రకారం.. సెప్టెంబర్ 8 నుంచి ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే కొత్త వెర్షన్లకు మాత్రమే సపోర్ట్ ఉంటుంది.
ఈ మార్పు గురించి వాట్సాప్ ముందుగానే వినియోగదారులకు సమాచారం అందించింది. పాత ఫోన్‌కు కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్ అందుబాటులో ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. అప్‌డేట్ అవకాశం లేకపోతే కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారాల్సి ఉంటుంది. పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో తాజా సెక్యూరిటీ అప్‌డేట్లు, కొత్త ఫీచర్లకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు అందుబాటులో లేకపోవడంతో వాటికి సపోర్ట్‌ను క్రమంగా నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. కొత్త ఫోన్‌కు మారే ముందు చాట్ హిస్టరీని బ్యాకప్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!