

కలెక్టర్ల సదస్సులో కొందరు అధికారులు గైర్హాజరు కావడం, మరికొందరు అధికారులు సమావేశం పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కీలక సమావేశాలకు అధికారులు పూర్తి స్థాయిలో హాజరై, చర్చలను శ్రద్ధగా వినాలని ఆయన సూచించారు. తాను చెప్పే విషయాలను కొందరు అధికారులు ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నారని వ్యాఖ్యానించారు.
సమావేశంలో ఫోన్లు ఉపయోగించవద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ కొందరు అధికారులు వాటిని వినియోగించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులంతా సమావేశంలో పూర్తి సమయం కూర్చొని చర్చలపై దృష్టి పెట్టాలని సూచించారు. 12 గంటలు కూడా కూర్చొని సమావేశాన్ని కొనసాగించలేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలంటే అధికారుల నిబద్ధత, సమన్వయం ఎంతో అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!