
జనరల్

పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్ ఆలయంలో సుమారు రెండున్నరేళ్ల క్రితం అర్ధరాత్రి చోరీ జరిగింది. నరసింహస్వామికి చెందిన వెండి ఆభరణాలతో పాటు పూజా సామగ్రి కూడా అపహరణకు గురైంది. తాజాగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఓ సంచి కనిపించింది. దానిని ఆలయ పూజారి గమనించి పరిశీలించగా, రెండేళ్ల క్రితం మాయమైన స్వామివారి వెండి ఆభరణాలు అందులో కనిపించాయి.
సంచిలో ఆభరణాలతో పాటు ఓ లేఖ కూడా ఉన్నట్లు తెలిసింది. మద్యం మత్తులో స్పృహ కోల్పోయి ఈ తప్పు చేశానని, ఇన్నాళ్లకు తన తప్పును గ్రహించి స్వామివారి సొత్తును తిరిగి అప్పగిస్తున్నానని లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఆలయ చోరీకి సంబంధించిన సొత్తు అనూహ్యంగా తిరిగి ఆలయానికి చేరడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!