

బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్‌గా ప్రారంభమైనప్పటి నుంచి హౌస్‌లో గొడవలు, టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య పోటీతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ కలిపి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బ్లూ టీమ్, రెడ్ టీమ్‌లుగా విడిపోయిన కంటెస్టెంట్ల మధ్య మైండ్ గేమ్స్, ఫిజికల్ టాస్కులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా త్రిగుణ్ తన దూకుడు వైఖరితో హౌస్‌లో చర్చనీయాంశంగా మారగా.. రోహిత్‌తో అతడి విభేదాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఏకంగా 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను తీసుకురావాలని బిగ్‌బాస్ యాజమాన్యం భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘బిగ్ అగ్ని పరీక్ష 2’లో పాల్గొన్న రామకృష్ణ, మితిలేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రామకృష్ణ ఎంట్రీ దాదాపు ఖాయమని, మితిలేష్ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. మహిళా కంటెస్టెంట్లలో సీరత్ కపూర్, సోనియా, ఆషిక, సౌందర్య రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జబర్దస్త్ కమెడియన్లు నూకరాజు, రాకింగ్ రాకేష్‌లను కూడా సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పేర్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై బిగ్‌బాస్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ వీరిలో పలువురు హౌస్‌లోకి వస్తే ప్రస్తుత కంటెస్టెంట్ల సమీకరణాలు మారే అవకాశం ఉంది.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!