

భారత్‌లో తొలి అంతర్జాతీయ ఏఐ మహాసభగా నిర్వహిస్తున్న AI Impact Summit 2026 ఈ నెల16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కీలక సెషన్లు, ఎగ్జిబిషన్లు, పాలసీ చర్చలు, పరిశ్రమల భాగస్వామ్య సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ఈ నెల 19 మరియు 20 తేదీల్లో ప్రధాన సమ్మిట్ జరగనుండగా, ప్రపంచవ్యాప్తంగా AI రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇందులో సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మన్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు.
సమ్మిట్‌కు హాజరుకావాలనుకునే వారు డెలిగేట్‌గా ఆన్లైన్లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. నమోదు సమయంలో వ్యక్తిగత వివరాలు, ఫోటో అప్లోడ్ చేయాలి మరియు OTP ద్వారా ఈమెయిల్ ధృవీకరణ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ అనంతరం అందే QR కోడ్‌ను ప్రాంగణంలో ప్రవేశానికి చూపాల్సి ఉంటుంది. ఈ నెల 19 న జరిగే ప్రారంభ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనుండగా, ఆ రోజు కొన్ని సెషన్లకు డెలిగేట్లకు ప్రవేశం ఉండదు.
ఈ మహాసభలో ప్రపంచ టెక్, పరిశ్రమ, పాలసీ రంగాల ప్రముఖులు పాల్గొంటున్నారు. వారిలో డెమిస్ హస్సాబిస్, ముఖేష్ అంబానీ, సలిల్ పారేఖ్, క్రిస్టియానో అమోన్, కె. కృతివాసన్, జూలీ స్వీట్, మాథ్యూ ప్రిన్స్, డారియో అమోడై, సునీల్ భారతి మిట్టల్, అలెగ్జాండర్ వాంగ్ వంటి ప్రముఖులు ఉన్నారు. అయితే జెన్సెన్ హువాంగ్ అనివార్య కారణాలతో ఈసారి హాజరుకాలేకపోతున్నారు. సమ్మిట్‌లో బాధ్యతాయుత ఏఐ, పెట్టుబడులు, గ్లోబల్ సహకారం వంటి అంశాలపై కీలక చర్చలు జరుగనున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!