

ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్లో కీలక బాధ్యతలు నిర్వహించిన మృణాక్ శర్మ రాజీనామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కంపెనీలో తన చివరి రోజు అని ప్రకటించిన శర్మ, “ప్రపంచం తీవ్రమైన ప్రమాదంలో ఉంది” అంటూ తన నిర్ణయానికి కారణాలను వివరిస్తూ సహోద్యోగులకు రాసిన లేఖను బహిర్గతం చేశారు.
ఆ లేఖలో ఏఐ, జీవాయుధాలు సహా అనేక పరస్పర సంబంధిత గ్లోబల్ సంక్షోభాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన శర్మ, ఆంత్రోపిక్లో రెండు సంవత్సరాల పాటు ఏఐ భద్రతపై పరిశోధనలు చేశారు. ఏఐ చాట్బాట్లు వినియోగదారుల ఆలోచనా విధానాలను ఎలా ప్రభావితం చేస్తాయన్న అంశంపై కూడా ఆయన కీలక అధ్యయనం చేశారు.
ప్రస్తుతం తనకు తదుపరి ప్రణాళిక ఏమీ లేదని, యూకేకు తిరిగి వెళ్లనున్నట్లు శర్మ తెలిపారు. ఇటీవలి కాలంలో ఆంత్రోపిక్ నుంచి పలువురు పరిశోధకులు నిష్క్రమించినప్పటికీ, ఇవి విడివిడిగా తీసుకున్న నిర్ణయాలేనని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ, ఈ రాజీనామా ఏఐ భద్రత, నైతికతపై మళ్లీ చర్చలకు దారితీసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!