
జనరల్

దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2022లో ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు ఖరారు చేసింది. ఈ కేసులో దాఖలైన అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.
2008 జూలై 26న అహ్మదాబాద్‌లో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 ప్రాంతాల్లో ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 56 మంది మృతి చెందగా, 246 మంది గాయపడ్డారు. అనంతరం సూరత్‌లో పేలని బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 78 మందిపై విచారణ జరగగా, 2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా, 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పుడు ఆ శిక్షలను గుజరాత్ హైకోర్టు సమర్థించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!