
జనరల్

తల్లి అయిన తర్వాత తన సినీ ప్రయాణంలో కొత్త మార్పు వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ తెలిపారు. ఇకపై తన కొడుకు నీల్ గర్వపడేలా ఉండే అర్థవంతమైన, బాధ్యతాయుతమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నానని ఆమె వెల్లడించారు. మాతృత్వం తనలో కొత్త ఆలోచనలను తీసుకొచ్చిందని, అందుకే కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ‘రామాయణ’ చిత్రంలో మండోదరి పాత్రలో నటిస్తున్న కాజల్, ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. తన కుమారుడు నీల్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడని, థియేటర్‌లో అతడు చూసే తొలి చిత్రం ఇదేనని వెల్లడించారు. ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించే పాత్రల్లోనే ఇకపై నటించాలని భావిస్తున్నట్లు కాజల్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!