
జనరల్

ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అరుదైన గుర్తింపును అందుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఐఐఎం ఇండోర్ అతని విజయగాధను పరిశోధన అంశంగా ఎంపిక చేసింది.
ఈ అధ్యయనం ద్వారా చిన్న వయసులో వచ్చిన ఖ్యాతి, సోషల్ మీడియా ప్రభావం, ఒత్తిడి, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలను విశ్లేషించనున్నారు. సుమారు మూడు నెలల పాటు జరిగే ఈ రీసెర్చ్ ఫలితాలను బీసీసీఐతో కూడా పంచుకోనున్నారు. ఐపీఎల్‌లో అతను 776 పరుగులు, 72 సిక్సర్లు, ఆరెంజ్ క్యాప్ మరియు MVP అవార్డు సాధించడం అతని ప్రతిభను మరింత ప్రత్యేకంగా నిలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!