

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. శాంతి చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ పరస్పరం క్షిపణులు, డ్రోన్‌లతో దాడులకు దిగాయి. ఇరాన్ కువైట్‌లోని అల్ సలేం వైమానిక స్థావరం, బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కువైట్ వ్యాప్తంగా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో అక్కడి రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్‌లను అడ్డుకున్నట్లు కువైట్ సైన్యం తెలిపింది. బహ్రెయిన్‌లో కూడా సైరన్‌లు మోగించడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించింది. శత్రు దాడులకు మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ కేంద్రం సహా పలు లక్ష్యాలపై దాడులు విజయవంతమయ్యాయని తెలిపింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ ప్రకటనలను ఖండిస్తూ ఇరాన్ దాడులను పూర్తిగా అడ్డుకున్నామని పేర్కొంది. ఆత్మరక్షణ కోసమే తమ చర్యలు చేపట్టినట్లు అమెరికా తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!