
జనరల్

భారత యువ షట్లర్ అస్మిత చాలిహా కొరియా మాస్టర్స్ 300 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ఆసన్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి హాన్‌పై 14-21, 21-14, 21-14 తేడాతో విజయం సాధించింది.
అస్సాంకు చెందిన 26 ఏళ్ల ఈ షట్లర్ తొలి గేమ్‌ను కోల్పోయినా, తరువాతి రెండు గేముల్లో దూకుడుగా ఆడి అద్భుతంగా తిరిగి నిలిచింది. గంటలోపే మ్యాచ్‌ను ముగించి తన కెరీర్‌లో ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసి తొలి అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!