

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కీలక సమయంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన శివమ్ దూబే 31 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం.
లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులకే పరిమితమైంది. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో 3 ఓవర్లలో కేవలం 9 పరుగులకే 3 వికెట్లు తీసి మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో దూబే మెరుపులు, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి ప్రభావంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.
ఈ విజయంతో టీమిండియా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి అద్భుత ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత్ యూఎస్ఏపై 29 పరుగులు, నమీబియాపై 93 పరుగులు, పాకిస్థాన్‌పై 61 పరుగులు, నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గెలిచి 4లో 4 విజయాలతో గ్రూప్‌లో బలమైన స్థితిలో నిలిచింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!