
క్రీడలు

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్టుకు తొలి రౌండ్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి ఇద్దరూ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. జపాన్ ఆటగాడు కోకి వతనాబే చేతిలో లక్ష్యసేన్ నేరుగా గేమ్స్‌లో పరాజయం చెందాడు.
మరోవైపు, థాయ్‌లాండ్ స్టార్ కున్లావుట్ విటిడ్సార్న్‌పై ఆయుష్ శెట్టి గట్టి పోరాటం చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ ఇద్దరి నిష్క్రమణతో భారత పురుషుల సింగిల్స్ ఆశలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు మిగిలిన భారత షట్లర్లపై అభిమానుల దృష్టి నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!