

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌తో కీలక టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో విజయంతో పర్యటనను ఆరంభించాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్, ఐర్లాండ్ సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైనప్పటికీ ఇప్పుడు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెరుగయ్యాయి.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ కొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా, ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో, సంజు శాంసన్ ఐదో స్థానంలో ఆడనున్నాడు. ఆల్‌రౌండర్లుగా శివమ్ దూబే, అక్షర్ పటేల్, బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్‌కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా వేగం, స్పిన్ సమతుల్యతతో భారత జట్టు కూర్పును సిద్ధం చేసినట్లు సమాచారం.













కామెంట్స్ (1)
Good decision