

టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2025 సంవత్సరాన్ని అద్భుతంగా ముగించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు శతకాలు, ఒక అజేయ అర్ధశతకంతో తన ఫామ్‌ను చాటాడు. ఈ జోష్‌తో 2026 లోకి అడుగుపెట్టనున్న కోహ్లీకి మూడు అరుదైన రికార్డులు చేరువలో ఉన్నాయి.
మొదటిగా, ఐపీఎల్లో కోహ్లీ మరో 339 పరుగులు చేస్తే, లీగ్ చరిత్రలో 9,000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం 259 ఇన్నింగ్స్‌ల్లో 8,681 పరుగులతో ఐపీఎల్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. విశేషమేమిటంటే, ఆయన తన ఐపీఎల్ కెరీర్ అంతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతున్నాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.
రెండోది వన్డేల్లో 15,000 పరుగుల మైలురాయి. కోహ్లీకి ఇంకా 443 పరుగులు కావాలి. ప్రస్తుతం ఆయన 296 ఇన్నింగ్స్‌ల్లో 14,557 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు సచిన్ టెండుల్కర్ మాత్రమే.
మూడో రికార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించినది. మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 27,975 పరుగులు చేశాడు. మరో 42 పరుగులు చేస్తే, కుమార సంగక్కర ను అధిగమించి, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలుస్తాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లోనే ఈ రికార్డ్ సాధించే అవకాశం ఉంది.
.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!