

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) కొత్త కెప్టెన్ కోసం అన్వేషణ ప్రారంభించినట్లు సమాచారం. గత రెండు సీజన్లలో జట్టుకు నాయకత్వం వహించిన రిషభ్ పంత్ తిరిగి తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో ఎల్‌ఎస్‌జీ సిస్టర్ ఫ్రాంచైజీ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టుకు మార్క్రమ్ విజయవంతంగా నాయకత్వం వహిస్తున్నాడు.
అయితే ఎల్‌ఎస్‌జీ కెప్టెన్సీపై తాను పెద్దగా ఆలోచించడం లేదని మార్క్రమ్ స్పష్టం చేశాడు. జట్టు యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకుంటుందని, లక్నో జట్టులో ఇప్పటికే పలువురు సమర్థులైన నాయకులు ఉన్నారని పేర్కొన్నాడు. మార్క్రమ్‌తో పాటు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. అవసరమైతే మినీ వేలంలో కొత్త ఆటగాడిని తీసుకుని నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశమూ ఉందని సమాచారం. అలాగే ది హండ్రెడ్ టోర్నీలోని ప్రత్యేక నిబంధనలు కెప్టెన్సీకి కొత్త సవాళ్లు విసురుతున్నాయని, జోస్ బట్లర్ వంటి సీనియర్ ఆటగాళ్ల సూచనలు ఎంతో ఉపయోగపడుతున్నాయని మార్క్రమ్ వెల్లడించాడు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!