

కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ దేశీయ విమానాశ్రయాల వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం 58 కోట్లకు పెరిగిందని తెలిపారు. పలు విమానాశ్రయాల విస్తరణ, ఆధునికీకరణ వల్ల ఈ వృద్ధి సాధ్యమైందన్నారు. 2025-26లో దేశీయ విమానాశ్రయాల నుంచి 42 కోట్ల మంది ప్రయాణించారు. ప్రస్తుతం దేశంలో 166 విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, ఆమోదం పొందిన 25 కొత్త విమానాశ్రయాల్లో 14 ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దేశీయ విమానయాన సంస్థల వద్ద 860 విమానాలు ఉండగా, 2056 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వబడ్డాయి, అందులో 427 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మొత్తం 352 తీవ్రమైన సాంకేతిక లోపాలు నమోదయ్యాయి. అందులో 334 దేశీయ సర్వీసుల్లో, 18 అంతర్జాతీయ సర్వీసుల్లో చోటుచేసుకున్నాయి. ఆకాశ ఎయిర్లో అత్యధికంగా 152 లోపాలు నమోదయ్యాయి. తరువాత ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (53), ఇండిగో (47), ఎయిరిండియా (46), స్టార్ ఎయిర్ (29) ఉన్నాయి. ఇతర సంస్థలైన స్పైస్‌జెట్, ఫ్లై91, ఇండియావన్ ఎయిర్, బ్లూడార్ట్ ఏవియేషన్లో కూడా లోపాలు నమోదయ్యాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!