

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ పాకిస్థాన్‌పై భారత యువ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. చివరి వరకు నరాలు తెగేలా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. భారత ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్ (58), లక్ష్య రాజేష్ రాయచందానీ (80) అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభం అందించారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో వికె వినీత్ (24), అర్జున్ రాజ్‌పుత్ (16), యశ్బర్ధన్ చౌహాన్ (9), అన్వయ్ ద్రవిడ్ (19) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
ఈ దశలో భారత జట్టు ఒత్తిడిలో పడినా.. చివర్లో మోహిత్ ఉల్వా (49 నాటౌట్), మనల్ చౌహాన్ (47) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు పాకిస్థాన్ బౌలర్ అలీ రజా ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో భారత యువ జట్టు పాక్‌పై కీలక గెలుపును నమోదు చేసింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!