

హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదని, గత పదేళ్లుగా వారి ప్రభావం పెరుగుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్నాయని ఆరోపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేశారని, ఆ ఎన్నికలతోనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ.. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ కూటమి ఎక్కువ స్థానాలు గెలిచినా, మూడు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని గుర్తుచేశారు. ఆ మూడు నెలల వ్యవధిలో 70 లక్షలకు పైగా ఓట్లు అదనంగా నమోదయ్యాయని, ఆ ఓట్ల వల్లే భాజపా విజయం సాధించిందని రాహుల్ ఆరోపించారు.
రాజకీయాలంటే కేవలం గట్టిగా మాట్లాడటం, ఘాటైన విమర్శలు చేయడం కాదని రాహుల్ అన్నారు. హైదరాబాద్, బెంగళూరులో ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దేశంలోని కీలక రంగాల్లో అదానీ సంస్థల పెట్టుబడులు పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందని, పోర్టులు, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాల రంగాల్లో ఆయనకు ప్రయోజనం చేకూరిందని ఆరోపించారు. లబ్ధి పొందిన వ్యాపారవేత్తలు వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!