
న్యూస్

భద్రతా కారణాలను చూపిస్తూ భారత్లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని కోరగా, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఇచ్చిన 24 గంటల గడువు కూడా ముగిసినా, బంగ్లాదేశ్ నుంచి ఇంకా అధికారిక సమాధానం రాలేదని సమాచారం.
ఈ పరిణామాలతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ జట్టుకు అవకాశం లభించే పరిస్థితి కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ దశలో భారత్లో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే ఈ మార్పులపై ఐసీసీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!