
జనరల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. చెపాక్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించి సీఎస్కే నాకౌట్ ఆశలను ముగించింది. 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్ అజేయ 70 పరుగులతో మెరవగా, హెన్రిచ్ క్లాసెన్ 47 పరుగులతో కీలక పాత్ర పోషించాడు.
ఇంతకుముందు ప్యాట్ కమిన్స్ 3/28తో సీఎస్కే టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 44, కార్తిక్ శర్మ 32, శివం దూబే 26 పరుగులతో రాణించినా చెన్నై 181 పరుగులకే పరిమితమైంది.

ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!