

న్యూఢిల్లీలో జరగనున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2026కు ముందు భారత స్టార్ షట్లర్ల సీడింగ్స్ ఖరారయ్యాయి. మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు 9వ సీడ్ దక్కగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ 5వ సీడ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌కు 14వ సీడ్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనిషా క్రాస్టో జోడీకి 15వ సీడ్ లభించింది.
ఆగస్టు 17 నుంచి 23 వరకు ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుండగా, భారత్ ఐదు విభాగాల్లోనూ రెండేసి ఎంట్రీలను బరిలోకి దింపుతోంది. నాలుగు విభాగాల్లో భారత ఆటగాళ్లు లేదా జోడీలు సీడింగ్ పొందడం దేశ బ్యాడ్మింటన్ పురోగతిని ప్రతిబింబిస్తోంది. టోర్నీ డ్రా బుధవారం జరగనుండగా, సీడెడ్ ఆటగాళ్లు ఎవరైనా వైదొలిగితే స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!