

ఆసియా కప్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు 2026 ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ శుక్రవారం క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్య జపాన్‌తో తలపడనుంది. నిషిన్‌లోని కొరోగి అథ్లెటిక్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. మహిళల క్రికెట్ విభాగంలో పోటీలు నేరుగా నాకౌట్ దశ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు విజయంతో తమ టైటిల్ వేటను ప్రారంభించాలని భావిస్తోంది.
ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఓపెనర్ షెఫాలి వర్మతో పాటు స్మృతి మంధానపై భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణి కీలకం కానున్నారు. గాయాల నుంచి కోలుకుని రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్ జట్టులోకి రావడంతో భారత జట్టు బలగం మరింత పెరిగింది. రేణుకా ఠాకూర్, నందని శర్మ, క్రాంతి గౌడ్‌లతో పేస్ విభాగం కూడా సిద్ధంగా ఉంది.
ఇప్పటికే బంగ్లాదేశ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. చైనాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ వర్షం, తడిసిన మైదానం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. టోర్నీ నిబంధనల ప్రకారం మెరుగైన ర్యాంక్ కలిగిన బంగ్లాదేశ్ సెమీస్‌కు అర్హత సాధించింది. మరో క్వార్టర్‌ఫైనల్లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 91/4 చేయగా.. పాకిస్థాన్ 10.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!