

ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రీడా వేడుకల్లో ఆసియా క్రీడలు ఒకటి. ఈ పోటీల్లో పతకం సాధించడం క్రీడాకారుల కెరీర్‌లో కీలక విజయంగా భావిస్తారు. జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న 2026 ఆసియా క్రీడల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 19 మంది క్రీడాకారులు భారత్ తరఫున వివిధ విభాగాల్లో పోటీ పడుతున్నారు. ఆర్చరీలో ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ధీరజ్.. ఆసియా క్రీడల్లోనూ పతకంపై గురిపెట్టాడు. జ్యోతిసురేఖకు ఆసియా క్రీడల్లో ఇప్పటికే మూడు స్వర్ణాలతో పాటు రజతం, కాంస్య పతకాలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన చికిత తానిపర్తి, తిరుమూరు గణేశ్ మణిరత్నం కూడా ఆర్చరీలో తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు.
బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు మరోసారి ఆసియా క్రీడల్లో బరిలోకి దిగుతోంది. గాయం కారణంగా గత క్రీడలకు దూరమైన సింధు.. ఇటీవల జపాన్ ఓపెన్ టైటిల్‌తో ఫామ్‌లోకి వచ్చింది. కిదాంబి శ్రీకాంత్, తరుణ్ మన్నెపల్లి సింగిల్స్‌లో పోటీపడనుండగా.. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ, ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీలపై కూడా అంచనాలు ఉన్నాయి. 2022 ఆసియా క్రీడల్లో సాత్విక్-చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్‌లో స్వర్ణం, టీమ్ విభాగంలో రజతం సాధించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!